ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ ప్రభాకర్,ఎస్ఎన్ఎస్ పోలమ్మ ఉద్యోగ విరమణ పొందారు
.jpg)
ఆర్కేపీ ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ డాక్టర్ జక్కుల ప్రభాకర్,ఎస్ఎన్ఎస్ గూడెపు పోలమ్మ ఉద్యోగ విరమణ పొందారు -- ఆసుపత్రిలో డాక్టర్ ప్రభాకర్,స్వీపర్ పోలమ్మకు ఘనంగా సత్కారం రామకృష్ణాపూర్ న్యూస్,జులై-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక టీవీ న్యూస్ : సింగరేణి కాలరీస్ లోని మందమర్రి డివిజన్ పరిధిలో గల రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసీఎంవో గా పనిచేసిన డాక్టర్ జక్కుల ప్రభాకర్ (61) అలాగే ఆసుపత్రిలో ఎస్.ఎన్.ఎస్ గా పనిచేసిన గూడెపు పోలమ్మ (61)అనే స్వీపర్ గురువారం ఉద్యోగ విరమణ పొందారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో డాక్టర్ ప్రభాకర్ అలాగే గూడెపు పోలమ్మను సింగరేణి యాజమాన్యం ఘనంగా సత్కరించింది.ఆ నేపథ్యంలోనే ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సన్మాన సభ కార్యక్రమంలో ముందుగా డివైసీఎంఓ డాక్టర్ ప్రభాకర్ ఉద్యోగరీత్యా ఆయన సర్వీసులో 30 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసినట్లు దాంతో ఉద్యోగ విరమణ పొందినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.అలాగే గూడెపు పోలమ్మ కూడా 34 సంవత్సరాల 11 నెలలు ఉద్యోగంలో సర్వీస్ పూర్తి చేసి రిటైర్డ్ అయినట్లు పేర్కొన్నారు.ఆ సందర్భంగా ఆసుపత్రి డివ...