Posts

Showing posts from August, 2025

బోగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి రికార్డు నెలకొల్పింది

Image
బోగ్గు ఉత్పత్తి,ఉత్పాదకత,రక్షణలో సింగరేణి రికార్డు  -  సింగరేణి 55వ వార్షిక భద్రతా పక్షోత్సవాలు భారీ ఎత్తున చేపట్టిన వైనం..  --  ఆర్కేపీ ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో అత్యంత వైభవంగా వేడుకలు -  ముఖ్య అతిథి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఉజ్వల్ థా --  అధ్యక్షులు సింగరేణి చైర్మన్ ఎన్.బలరాం ప్రసంగం... -  సింగరేణి వ్యాప్తంగా వేల సంఖ్యలో తరలివచ్చిన ఉద్యోగులు -  ఉన్నత అధికారులు-అతిథులకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు  -  ముందుగా ముఖ్యఅతిథి,సింగరేణి చైర్మన్ కలిసి జ్యోతి ప్రజ్వాలన చేశారు -  సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు --  సింగరేణి చైర్మన్ ఎన్.బలరాం ప్రసంగం... రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-31,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత రక్షణలో ముందంజలో ఉందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఎంఎన్ఆర్ గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం సింగరేణి 55వ వ...

సున్నం బట్టి వాడ లైన్స్ భవనంలో రేపు ఉచిత నేత్ర శిక్షణ శిబిరం

Image
సున్నం బట్టి వాడ లైన్స్ భవనంలో రేపు ఉచిత నేత్ర శిక్షణ శిబిరం  -- మంచిర్యాల లైన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్  మంచిర్యాల న్యూస్,ఆగస్టు-30,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : లైన్స్ క్లబ్ మంచిర్యాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల-31న ఆదివారం ఉదయం-10 గంటల నుంచి మంచిర్యాల పట్టణంలోని సున్నం బట్టి వాడలో గల లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత నేత్ర వైద్య చికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహిస్తున్నారు.ఆ శిబిరంలో 50 సంవత్సరముల పైన వయస్సున్న వారికి కంటి జబ్బులతో బాధపడుతున్న వారు కంట్లో పొరలు వచ్చినవారు డాక్టర్లచే పరీక్షలు నిర్వహించి కంటి చికిత్సకు ఎంపికైన వాళ్లను మరుసటి 1-9-2025 సోమవారం లైన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న రేకుర్తి ఐ హాస్పిటల్ నిర్వాహకులు సమకూర్చిన బస్సులో ఉచిత బస్సు ప్రయాణము,భోజన సదుపాయము,వసతి,సమకూరుస్తూ కరీంనగర్ కు పంపిస్తారు.దాంతో ఉచిత కంటి శాస్త్ర చికిత్సలు జరిపిస్తారు.అయితే ప్రజలు అట్టి మంచి అవకాశాన్ని  సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం సంబంధిత కరపత్రాలను విడుదల చేశారు.ఆ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ లయన్ జి.శ్యాంసుందర్రావు,సెక్రెటరీ లయన్ కె.భాస్కర్ రెడ్డి...

మద్యం సేవిస్తూ జీవితంపై విరక్తితో సతీష్ ఆత్మహత్య

Image
మద్యం సేవిస్తూ జీవితంపై విరక్తితో సతీష్ ఆత్మహత్య  --  ఆర్కేపి ఏఎస్ఐ కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు  రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఏ-జూన్ ప్రాంతంలోని రాంనగర్ కు చెందిన చివరు శెట్టి సతీష్(40)అనే 108 అంబులెన్స్ డ్రైవర్ శుక్రవారం సొంత ఇంట్లోనే టవల్ తో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆ క్రమంలో చూస్తే..భార్యాభర్తల మధ్య తగాదాలు ఏర్పడడంతో గత మూడు సంవత్సరాలుగా వేరుగా ఉంటున్నట్లు ఏఎస్ఐ వెంకన్న తెలిపారు.దాంతో ప్రతినిత్యం మద్యానికి బానిసై అనేకసార్లు చనిపోతానని చెప్పినట్లు పేర్కొన్నారు.ఆ నేపథ్యంలోనే ఒంటరితనం భరించలేక జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఆ మృతునికి భార్య ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని వివరించారు.

ప్రజా పాలన ద్వారానే ప్రజల సంక్షేమానికి కృషి

Image
ప్రజా పాలన ద్వారానే ప్రజల సంక్షేమానికి కృషి  --  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల న్యూస్,ఆగస్టు-29,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్:ప్రజల సంక్షేమానికి ప్రజా పాలన ద్వారానే కృషి చేయడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీరంలో వరద నీటి పరిస్థితి, మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు.ఆ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ..ప్రభుత్వం ప్రజా పాలన ద్వారా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు లోనికి 7 లక్షల నుండి 8 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరిందని తెలిపారు. నది తీర ప్రాంతాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో రక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.వరదల కారణంగా ప్రతి సంవత్సరం మాత శిశు ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న గర్భిణీలు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతిసారి వారి సంక్షేమం కోసం ఇతర...

అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ భారీ ఎత్తున అన్నదానం చేపట్టారు

Image
అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ భారీ ఎత్తున అన్నదానం చేపట్టారు - అన్నదాతా సుఖీభవ అంటూ భక్తుల ఆశీర్వాచనాలు - అంజనీపుత్ర సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్,మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి సందేశం.. మంచిర్యాల న్యూస్,ఆగస్టు-28,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్: వినాయక చవితి పండుగ నవ రాత్రోత్సవాల్లో భాగంగా గురువారం మొదటి రోజు దాదాపు 2000 వేల మందికి పైగానే అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం-ప్రోగ్రాం నిర్వహించారు.ఆ తరుణంలో రుచికరమైన భోజనాలు చేసిన ఇంకా తిన్న తర్వాత ప్రజలు,భక్తులు అన్నదాతా సుఖీభవ అంటూ ఆశీర్వాదములు మెండుగా అందించారు.ఆ సందర్భంగా అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్,మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడారు.అన్ని దానాల్లో అన్న దానం చాలా గొప్పదని గుర్తు చేశారు.సామాజిక కార్యక్రమాలలో అంజనీ పుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.కాగా గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో అంజనీ పుత్ర అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది.దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా అన్నదానం తప్పనిసరయింది.దాంతో అక్కడి జనాభా సంఖ్యకు అనుగుణంగా భారీగానే అన్నదానం నిర్వహించారు...

ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ,వివిధ ఆసుపత్రుల అధికారులు,డాక్టర్లు బదిలీలు

Image
ఆర్కేపి ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ,వివిధ ఆసుపత్రుల అధికారులు,డాక్టర్లు బదిలీలు -  సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ.. జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.. సింగరేణి కాలరీస్లోని ఏరియా ఆసుపత్రిలలో పనిచేస్తున్న డివై సీఎమ్ఓ,సంబంధిత అధికారులు,డాక్టర్లను బదిలీ చేస్తూ మంగళవారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణపూర్ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ పి.ప్రసన్నకుమార్ ఆర్ జి-1 ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు.అలాగే బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి చెందిన డివై సీఎమ్ఓ డాక్టర్ ఏం.మధుకుమార్ ను రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి యాజమాన్యం బదిలీ చేసింది.అంతేకాకుండా మరి కొంతమంది వివిధ ఆసుపత్రిలో పనిచేస్తున్న అధికారులు డాక్టర్లను కూడా సింగరేణి యాజమాన్యం వేరే ఏరియాలలోని అక్కడి ఆసుపత్రులకు బదిలీలు చేసింది.ఆ నేపద్యంలోనే ట్రాన్స్ఫర్ కాబడిన అక్కడి హాస్పిటల్ లో వెంటనే రిపోర్టు చేయాలని సంబంధిత హెచ్ ఓ డి ఆదేశాలు జారీ చేసారు.

నేడు మహిళా సమానత్వ దినోత్సవం-మహిళా సమానత్వ సవాళ్లు

Image
మహిళా సమానత్వ సవాళ్లు -- నేడు మహిళా సమానత్వ దినోత్సవం -- జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్.. మహిళా నేటికీ పురుషాధిక్య సమాజంలో ద్వితీయ శ్రేణి పౌరురాలుగానే భావించబడుతున్నది.ఆ క్రమంలో చూస్తే..అసమానతల అంతరాల్లో వంటింటి కుందేలవుతున్నది.ఆర్థిక స్వేచ్ఛ ఇంకా ఆమడదూరంలోనే ఉన్నది.ఆమె గళం గడప దాటడం లేదు.పడతి మాటకు విలువుండటం లేదు.ఒంటరి మహిళను నేటికీ అసహ్యంగా చూస్తున్న దుస్థితి.ఆమె తెర వెనుక శ్రమజీవి,ఆయన తెరపైన కాలర్‌ ఎగిరేసే పురుష పుంగవుడు.భర్త చనిపోతే సతీ సహగమనం పాటించిన సమాజం మనది.స్త్రీ శ్రమకు విలువ పాతాళంలో,పురుషుని శ్రమ విలువ ఆకాశమంత.ఆమె ఎప్పటికైనా అత్తింటికి వెళ్లే ఆడదేనన్న చిన్నచూపు ఇంకా మనం జీవిస్తున్న ఈ సమాజంలో వేళ్లూనుకుని ఉన్నది.దీన్ని అధిగమించడానికి అనేకరంగాల్లో మహిళలు దూసుకెళ్తున్నా వారికి అడుగడుగునా వివక్షే ఎదురవుతున్నది.దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అక్కడ కూడా ఆధిపత్యమే రాజ్యమేలుతున్నది.అయినప్పటికీ ఈ సవాళ్లను అధిగమిస్తూ మహిళ తానేంటో నిరూపించుకుంటున్నది.కానీ పౌరసమాజం నుంచి కావాల్సినంత సహకారం ఉండటం లేదు.మహిళా సమానత్వంపై అవగాహన కల్పించడం నేటి పరిస్థితుల్లో చాలావరకు కని...

పవన్ కుమార్ యువకునికి పున:ర్జన్మనిచ్చిన హైదరాబాదు యశోద హాస్పిటల్ వైద్యం

Image
పవన్ కుమార్ యువకునికి పున:ర్జన్మనిచ్చిన హైదరాబాదు యశోద హాస్పిటల్ మెరుగైన వైద్యం  రోడ్డు ప్రమాదంతో ఫ్రాక్చర్ తర్వాత నరాలకు గాయం  సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అందించిన మెరుగు లేదు  కుడికాలుకు నరం చిక్కుకున్న ఆ నాడిని విడుదల చేశారు  హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పి.ప్రకాష్ వివరాలు వెల్లడి  మంచిర్యాల నార్త్ ఇన్ హోటల్లో ప్రింట్ అండ్ మీడియా సమావేశం  మంచిర్యాల న్యూస్,ఆగస్టు-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : కొమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్ కు చెందిన పవన్ కుమార్ (24) అనే డిగ్రీ చదువుకునే యువకుడు రోడ్డు ప్రమాదంలో అతని కుడికాలుకు బలమైన గాయాలు కావడంతో అతని నరాలు మచ్చ కణజాలంలో సయాటిక్ నరం చిక్కుకుంది.ఆ క్రమంలో చూస్తే..వివిధ ఆసుపత్రిలో తిరిగిన కూడా డబ్బులు లక్షలు ఖర్చు అయిన కూడా అతనికి సరైన వైద్యం అందకపోవడంతో హైదరాబాదులోని హైటెక్ సిటీలో గల యశోద హాస్పిటల్స్ లో చేరారు.ఆ వ్యక్తికి మెరుగైన వైద్యం అందించడంతో అతనికి పునర్జన్మ లభించింది.ఆ నేపథ్యంలోనే యశోద హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్.పి.ప్రకాష్,అసిస్టెంట్ మేనేజర్ పాలకుర్తి నవీన్ కుమార్ తో క...

వరల్డ్ రికార్డ్ కామధేను డాక్టరేట్ అవార్డు అందుకున్న తెలంగాణ ఆనందయ్య

Image
వరల్డ్ రికార్డ్ కామధేను డాక్టరేట్ అవార్డు అందుకున్న తెలంగాణ ఆనందయ్య --   12-రకాల సరిక్రోత్త మందులు కనిపెట్టి సక్సెస్ అయ్యారు  --   మంచిర్యాల ఆయుర్వేదం డాక్టర్ గంట ఆనందం సేవలపై స్పెషల్ స్టోరీ  --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్... మంచిర్యాల న్యూస్,ఆగస్టు-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాల పట్టణానికి చెందిన గంట ఆనందం ఆయుర్వేదం డాక్టర్ "12" రకాల సరికొత్త ఆయుర్వేదిక్ మందులు కనిపెట్టి విశ్వగురు వరల్డ్ రికార్డ్ కామదేను డాక్టరేట్ అవార్డు కైవసం చేసుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల పట్టణంలోని ముఖరాం చౌరస్తాలో గల న్యూ రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన గల ఒక బిల్డింగ్ పై అంతస్తులో డాక్టర్ ఆనందం ఆయుర్వేదం పేరుతో ఆయన వైద్య సేవలందిస్తున్నారు.ఆ నేపథ్యంలోనే ఆయన 12 రకాల సరికొత్త మందులను కనిపెట్టారు.అంతేకాకుండా కరోనా సమయంలో కూడా ఆయన మందు తయారు చేసి ఉచితంగా పంపిణీ చేసిన రోజులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తయారుచేసిన ఆ 12 రకాల మందులలో 1.ఆనంద తైలం,2.సర్వరోగ హర ఆనంద చూర్ణం,3.కరోనా ధూపం సానిటైజర్,4.మధునాశ...

శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి.

Image
శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలి. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలపై స్పందించవద్దు. డీజే లకు అనుమతులు లేవు. గణపతి మండప నిర్వాహక సభ్యులు,హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,అన్ని మతాల పెద్దలతో శాంతి సమావేశం. వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి. పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా. గోదావరిఖని ప్రతినిధి ఆగస్టు 23 జర్నలిస్ట్ తెలుగు దినపత్రిక న్యూస్: రామగుండం పోలీస్ కమీషనరేట్ లో గణపతి నవరాత్రిఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉన్నందున, రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంత వాతావరణం లో మతసామరస్యం సోదర భావంతో పండుగలను  నిర్వహించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం రామగుండం పోలీస్ కమిషనరేట్ క్వార్టర్స్ లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపెల్లి, మంచిర్యాల జోన్  పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో గణేష్ చతుర్థి, మిలాద్- ఉన్-నబీ ల పండుగల దృష్ట్యా శాంతి సంక్షేమ కమిటీ సమావేశం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా నిర్వహించారు.  సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పండుగ ప్రశాంత వాతావరణంల...

మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం

Image
మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం --  మందమర్రి సిఐ కే.శశిధర్ రెడ్డి రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : రానున్న వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో మత సామరస్యంతో విజయవంతంగా నిర్వహించుకోవాలని గురువారం మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శశిధర్ రెడ్డి తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు,వివిధ మత పెద్దలతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ.శశిధర్ రెడ్డి,క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు హాజరైనారు.ఆ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..పండుగలు మన సంస్కృతికి,ఐక్యతకు ప్రతీకాలని,వాటిని సహోదర భావంతో జరుపుకోవాలన్నారు.ఆ ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తుందని తెలిపారు.ఆ గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని,ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.గణేష్ నవరాత్రులలో డీజ...

వినాయక విగ్రహాలు-మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి

Image
వినాయక విగ్రహాలు-మండపాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి -- ఆర్కేపి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి  --  ఎస్ఐ జి.రాజశేఖర్ ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-21,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : వినాయక విగ్రహాలు,వినాయక మండపాల పూర్తి వివరాలు తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసి పోలీస్ స్టేషన్ లో సమాచారం తెలియజేయాలని గురువారం రామకృష్ణాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ..పట్టణ ప్రజలందరూ గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.ఆ నేపథ్యంలోనే *https://share.google/U5GINHpB3dXvEUnSy* ఈ Link ద్వారా సులభంగా మీ విగ్రహాలు ఇంకా మండపాల పూర్తి సమాచారాన్ని ఆన్లైన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.గణపతి నవరాత్రులు పురస్కరించుకొని రామకృష్ణాపూర్ పట్టణంలో  వినాయక విగ్రహాలు పెట్టేవారు తప్పనిసరిగా మండపాల పూర్తి వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలనీ తద్వారా ఆ మండపాల వద్ద భద్రత,బందోబస్త్ నిర్వహించడం సులభతరం అవుతుందనీ ఎస్.ఐ తెలిపారు.కాగా ఆన్లైన్ లో పూర్తి వివరాలు నమోదు చేయడం వలన మాత్రమే వినాయక మండపాలకు అనుమతి లభిస్తుందనీ *http...

79వ స్వాతంత్ర దినోత్సవంతో పతాకం ఆవిష్కరించిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు స్వామి

Image
79వ స్వాతంత్ర దినోత్సవంతో పతాకం ఆవిష్కరించిన క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు స్వామి  -  కొబ్బరికాయలు కొట్టి స్వాతంత్ర సమరయోధులకు ప్రెస్ క్లబ్ కమిటీ సెల్యూట్...  -  స్వాతంత్ర సమరయోధుల విరోచితమైన త్యాగపోరాటమే మనకు రక్షణ  -   ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారుడు కలువల శ్రీనివాస్ ప్రసంగం... రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-15,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ : భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవం-15 ఆగస్టు 2025 పురస్కరించుకొని శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆరంద స్వామి మువ్వన్నెల మూడు రంగుల జాతీయ పతాకంను ఆవిష్కరించారు.ఆ క్రమంలో చూస్తే.. రామకృష్ణాపూర్లోని రాజీవ్ చౌక్ లో గల మూతబడిన సివి రామన్ స్కూలు ముందుగల స్థలంలో ఏర్పాటుచేసిన ప్రోగ్రాంలో క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తితో నిర్వహించారు.ఆ సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు.అనంతరం కొబ్బరికాయలు కొట్టారు.తదానంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు (సిటీకేబుల్ రిపోర్టర్)స్వామి జాతీయ పతాకంను ...

బంగారం ఎత్తుకెళ్లిన దొంగను 24-గంటల్లోనే పట్టుకున్న పోలీసులు

Image
బంగారం ఎత్తుకెళ్లిన దొంగను 24-గంటల్లోనే పట్టుకున్న పోలీసులు  -  సిసి ఫుటేజ్ ద్వారానే ఆ సురేష్ దొంగను పట్టుకున్నారు -  దొంగను పట్టుకున్న పోలీసులకు క్యాష్ రివార్డు-అభినందనలు -  ఇంటి ముందర అందరూ తప్పకుండా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి  -  బెల్లంపల్లి ఏసిపి ఏ.రవికుమార్ -  ఆర్కేపి పోలీస్ స్టేషన్లో ప్రింట్ మీడియా సమావేశం రామకృష్ణాపూర్ న్యూస్,ఆగస్టు-10,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరగడి ప్రాంతంలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లోనే సురేష్ అనే దొంగను పట్టుకొని అరెస్టు చేసినట్లు బంగారం సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నట్లు బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రింట్,మీడియా సమావేశంలో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన తెలిపారు.రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన ఆ దొంగతనం కేసును కేవలం 24 గంటల్లోనే పట్టణ పోలీసులు చేదించినట్లు తెలిపారు.ఆ నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని,దొంగిలించబడిన పూర్తి సొత్తును స...