క్యాతనపల్లి మెప్మా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వివేక్

క్యాతనపల్లి మెప్మా ఆఫీసును లాంఛనంగా ప్రారంభించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ - ఆరు లక్షల నిధులతో కార్యాలయం నిర్మాణం - రెండు కోట్ల రుణాల చెక్కును పంపిణీ చేసిన మంత్రి - మంత్రి వివేక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం.... రామకృష్ణాపూర్ న్యూస్,సెప్టెంబరు-23,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ న్యూస్ :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియం ప్రక్కనే ఉన్నా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రక్కన స్థలంలో సుమారు ఆరు లక్షల నిధుల వ్యయంతో నిర్మించిన మెప్మా కార్యాలయాన్ని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మంగళవారం రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.ఆ క్రమంలో చూస్తే..జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మంత్రి కొబ్బరికాయలు కొట్టి పెద్ద ఎత్తున చేపట్టిన ప్రోగ్రాంలో మహిళా భవన్-మెప్మా కార్యాలయాన్ని మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఆ నేపథ్యంలోనే పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 567 మహిళా సంఘాలలోని సుమారు 6000 మంది సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.ఆ సందర్భంగా మంత్రి వివేక్ అక్కడి వేదికపై మాట్లాడారు.తెలంగాణ ...