Posts

Showing posts from February, 2025

రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Image
రవీంద్రఖని రైల్వే స్టేషన్ ఏరియాలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం -  ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్ -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్ ఫిబ్రవరి 28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ ఏరియాలో శుక్రవారం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్  ప్రోగ్రాం ఎట్టకేలకు నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలు మేరకు  రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీ ఇంకా గాంధీనగర్ ఏరియాలో ఈరోజు మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆదేశాలు మేరకు పట్టణానికి చెందిన పోలీసు సిబ్బందితో కలిసి సంబంధిత కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.దాంతో వాహన పత్రాలు సరిగా లేని 36 బైక్ లను,సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు.అలాగే 4 నాలుగు మోటర్ సైకిల్లను సీజ్ చేసారు.ఆ సందర్భంగా ఆర్కేపి ఎస్ఐ జి.రాజశేఖర్ మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన కోసమే ఆ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.కాగా ప్రజల రక్షణ,భద్రత పోలీస్ బాధ్యతన్నారు.పట్టణంలో కొత్త వ్యక...

ఎస్ఎల్బిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్లిన సింగరేణి ఎండి -- ఫ్లాష్...ఫ్లాష్

Image
ఎస్ఎల్బిసి సొరంగంలోకి లోకో రైలులో వెళ్లిన సింగరేణి ఎండి ఫిబ్రవరి 28, జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్ :  ఎస్ఎల్బిసి సొరంగంలో ప్ర‌మాద ఘ‌ట‌నా స్థ‌లికి స‌మీపంలోకి సింగ‌రేణి రెస్క్యూ బృందాలు రెస్క్యూ స‌భ్యుల్లో మ‌నో ధైర్యం నింపేలా సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్ సాహ‌సోపేత చ‌ర్య‌లు చేపట్టారు. సొరంగంలోకి రెస్క్యూ స‌భ్యుల‌తో  లోకో రైలులో వెళ్లిన సీఎండీ ఎన్‌.బ‌ల‌రామ్‌ గ‌త వారం రోజులుగా రాష్ట్ర‌, కేంద్ర బృందాల‌తో క‌లిసి స‌హాయ చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మైన సింగ‌రేణి బృందం మ‌రో 200 మంది సింగ‌రేణి బృందం రాక‌తో స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం రెస్క్యూ బృందంలో స్ఫూర్తిని నింపేందుకు గ‌త 24 గంట‌లుగా వారితోనే ఉంటున్న సీఎండీ  సంస్థ ఛైర్మ‌న్ స్వ‌యంగా ఆ రెస్క్యూ  బృందాలకు  నాయకత్వం వహించడంపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది.

హోరాహోరీగా తెలంగాణలో ఎన్నికలు..కాంగ్రెస్,బీజేపీకి షాక్ తప్పదా?

Image
హోరాహోరీగా తెలంగాణలో ఎన్నికలు కాంగ్రెస్,బీజేపీకి షాక్ తప్పదా? --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... తెలంగాణలో మూడు స్థానాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎన్నడూలేని విధంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.ఆ క్రమంలో చూస్తే.. రాజకీయపార్టీలు ప్రత్యక్షంగా,పరోక్షంగా ఈ ఎన్నికలపై ప్రభావం చూపిస్తుండటంతో గెలుపు ఎవరిదనేది ఉత్కంఠ రేపుతోంది.రెండు టీచర్స్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతుండగా అందరి దృష్టి కరీంనగర్,నిజామాబాద్,ఆదిలాబాద్,మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రల స్థానంపై నెలకొంది.ఆ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు బీఎస్పీ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి మధ్యనే ప్రధానపోటీ నెలకొంది.కాగా ప్రయివేట్ స్కూల్స్ అసోసియేషన్ మద్దతుతో పోటీలో ఉన్న మరో అభ్యర్థి కూడా వివిధ పార్టీల అభ్యర్థులతో సమానంగా పోటీపడుతున్నారు.తెలంగాణలో అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.అదే సమయంలో బీజేపీ సైతం గెలుపే లక్ష్యంగా పనిచేసింది.ఆ పార్టీకి చెందిన నలుగు ఎంపీలు బీజేపీ అభ్యర్థి కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ తరపున ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంల...

కేసీఆర్,కేటీఆర్,కవిత ఎవరికి మీ ఓటు చెప్తారా?

Image
కేసీఆర్,కేటీఆర్,కవితలు ఎవరికి ఓటు వేస్తారో చెప్తారా? -  మంచిర్యాలలో భారీ ఎత్తున పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం -  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదికపై ప్రసంగం.. -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... మంచిర్యాల న్యూస్ ఫిబ్రవరి 24 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంకా కవితలు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో సూటిగా అడిగారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో గల అక్కడి ప్రదేశంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం పెద్ద ఎత్తున సభకు సీఎం ముఖ్యఅతిథిగా హాజరైనారు.ఆ సందర్భంగా వేదికపై రేవంత్ రెడ్డి ప్రసంగించారు.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఓడించాలని బిఆర్ఎస్ బిజెపితో కుట్రలు చేస్తుందని పేర్కొన్నారు.ఆ బిజెపి బిఆర్ఎస్ చేసే కుట్రలను అందరూ గమనించాలన్నారు.బిజెపిలో ఎనిమిది మంది ఎంపీలు,ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రాష్ట్రానికి ఏమి తెచ్చారో చెప్పాలన్నారు.ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న బిజెపి...

నేడు మూడు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

Image
నేడు మూడు జిల్లాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన  --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... తెలంగాణ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో సోమవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..నిజామాబాద్‌,మంచిర్యాల,కరీంనగర్‌ జిల్లాలలో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం పర్యటిస్తున్నారు.కాగా ముఖ్యమంత్రి షెడ్యూల్ యొక్క వివరాలు ఈ క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి.  (1)  ఉ.11:30 గంటలకు నిజామాబాద్‌కు సీఎం రేవంత్‌ చేరుకుంటారు. (2)  మ.2 గంటలకు మంచిర్యాలలో జరిగే సభలో రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. (3) సా.4 గంటలకు కరీంనగర్‌కు సీఎం హాజరవుతున్నారు.ఆ నేపద్యంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి తరఫున సీఎం రేవంత్‌ నేడు ప్రచారంలొ పాల్గొంటారు.

79 ఏళ్ల వయసులో ఎంబీఏ చేస్తున్న ఉషా రే

Image
79 ఏళ్ల వయసులో కూడా ఎంబీఏ చేస్తున్న ఉషా రే --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... యూపీలోని లక్నోకు చెందిన ఉషా రే రెండుసార్లు క్యాన్సర్ వ్యాధిని జయించింది.అంతేకాకుండా 79 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఆమె ఎంబీఏ చదువుతున్నారు.ఆ క్రమంలో చూస్తే..మనిషి జీవితంలో ఏది సాధించాలన్నా వయసు అసలు అడ్డు కాదని నిరూపిస్తుందని చెప్పడంలో అసలు సందేహం లేదు.ఆ నేపథ్యంలోనే నేటి యువతకు ఆమె గొప్పగా ఆదర్శంగా నిలిచారు.ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ఆమె పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.కాగా ప్రధానంగా మెదడుకు పని చెప్పడం,సమయాన్ని వృధా చేయకుండా ఉండటం కోసం ఆమె ఎలాగైనా సరే ఈసారి ఎంబిఏ చదవాలని పట్టుదలతో నిర్ణయించుకుంది.

తెలంగాణలో అధికారం కోసం కసితో పనిచేస్తున్నాం

Image
తెలంగాణలో అధికారం కోసం కసితో పనిచేస్తున్నాం  -  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం భారతీయ జనతా పార్టీ కసితో పని చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లా ప్రభారీల సమావేశం రామకృష్ణాపూర్లోని ఏం ఎన్ ఆర్ గార్డెన్స్ లో ఆదివారం సాయంత్రం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేంద్ర మంత్రి సంజయ్ కుమార్ హాజరైనారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.బిజెపి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏం.కొమురయ్య,పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డిలను గెలిపించాలని కోరారు.ఉమ్మడి కరీంనగర్,అదిలాబాద్,మెదక్, నిజామాబాద్ పట్టబద్రుల,ఉపాధ్యాయుల ఎమ్మెల్సి  ఎన్నికలు- 2025లో ఆ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే..రాష్ట్రంలో కూడా భవిషత్తులో భాజపా తప్పకుండా గెలుస్తుందన్నారు.కే సి ఆర్ ఇంకా రేవంత్ పాలనల తీరుపై తీవ్రంగా విమర్శించారు.ఓటు అడిగే హక్కు బిజేపికి మాత్రమే ఉందన్నారు.ఈ14 నెలల కాలంలో కాంగ్రెస్ సిఎం చేసింది ఏమి లేదన్నారు.ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.అసలు కేటీఆర్ అర...

రేపు సిఎం మంచిర్యాల పర్యటన

Image
రేపు సిఎం మంచిర్యాల పర్యటన - ఏర్పాటను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... ఉమ్మడి ఆదిలాబాద్,మెదక్,నిజామాబాద్,కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేపు సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ కలెక్టరేట్ ముందుగల ఆవరణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్య అతిథిగా వస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి యొక్క సభ స్థలానికి సంబంధించిన ఆ ఏర్పాట్లను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం అక్కడికి చేరుకొని పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల డిసిపి భాస్కర్, ఏసిపి,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

పోలీసు సమస్యల పరిష్కారానికే దర్బార్

Image
 పోలీసు సమస్యల పరిష్కారానికే దర్బార్ -  రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... రామగుండం కమిషనరేట్ స్పెషల్ పార్టీ క్యూ ఆర్ టి సిబ్బంది అధికారులకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం.శ్రీనివాస్ ఆదేశాలు మేరకు కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో "దర్బార్" కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సిపి ముఖ్యఅతిథిగా హాజరైనారు.స్పెషల్ పార్టీ యు ఆర్ టి సిబ్బందితో పోలీస్ కమిషనర్  మాట్లాడినారు.వాళ్ల యొక్క సమస్యలను ఒక్కొక్కరిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.ఏలాంటి సమస్య ఉన్న దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే నేరుగా ఆఫీస్ కు వచ్చి కలిసి తెలుపాలని పేర్కొన్నారు.ఆ సందర్బంగా సీపీ మాట్లాడుతూ..స్పెషల్ పార్టీ క్యూ ఆర్ టి పోలీస్‌ విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోనాల్సి ఉంటుందని తెలిపారు.క్రమశిక్షణ ప్రణాళికబద్దంగా విధులు నిర్వహించడంతో ద్వారానే ఒత్తిళ్లను అధిగమించవచ్చని ప్రకటించారు.వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని గుర్తు చేశారు.ఆ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని కొన్ని సం...

రహదారి మధ్యలో ఖచ్చితంగా కొత్త తిమ్మాపూర్ కు యూటర్న్ ఇవ్వాలి

Image
రహదారి మధ్యలో తప్పకుండా కొత్త తిమ్మాపూర్ కు యూటర్న్ ఇవ్వాలి --  గ్రామస్తులు యువకులు పనులను అడ్డుకున్న వైనం ఇది  --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలో గల రహదారి విస్తరణ పనులలో భాగంగా రహదారి మధ్యలో డివైడర్లు నిర్మిస్తున్నా సంగతి తెలిసిందే.ఆ క్రమంలో చూస్తే..క్రొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే దారి వద్ద యూటర్న్ ఇవ్వకుండా డివైడర్ నిర్మించడంతో ఆ గ్రామస్తులు అక్కడి రోడ్డు పనులను శనివారం ఈరోజు అడ్డుకున్నారు.ఆ సందర్భంగా యువకులు మాట్లాడుతూ..గత కొద్ది రోజుల క్రితం గ్రామ నాయకులు చెన్నూరు శాసనసభ్యుడు జి వివేక్ ను కలిసి కలిసి వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.ఆ విషయంపై కూడా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.అక్కడి ప్రాంతంలో యుటర్న్ ఇచ్చే విధంగా చూస్తామన్నారు.కానీ అధికారులు సూచన మేరకు సిబ్బంది డివైడర్ను నిర్మించే ప్రయత్నం చేశారు.దాంతో గ్రామస్తులు, గ్రామ యువకులు అక్కడి పనులను అడ్డుకున్నారు.కాగా 70 సంవత్సరాలుగా చరిత్ర కలిగినటువంటి ఊరికి వెళ్లడానికి యూటర్న్ ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరార...

బైకులు,కార్లు ఉన్న వారికి బిగ్ షాక్?

Image
బైకులు,కార్లు ఉన్న వారికి బిగ్ షాక్? --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.. 20 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను భారీగా పెంచాలని కేంద్రం భావిస్తోంది.ఆ క్రమంలో చూస్తే..వాహన కాలుష్యం తగ్గించే చర్యల్లో భాగంగానే 20 ఏళ్లు పైబడిన సంబంధిత ఆ టూ వీలర్ కోసం ₹2వేలు,త్రీ వీలర్ కోసం ₹5వేలు,కార్లు ₹10వేలు, మీడియం ప్యాసింజర్/గూడ్స్ వాహనాలకు ₹25వేలు, హెవీ వెహికల్స్కు ₹36వేలు వసూలు చేయనుంది.ఆ నేపథ్యంలోనే 15 ఏళ్లు పైబడిన మీడియం ప్యాసింజర్ వాహనాలకు ₹12వేలు,హెవీ వాటికి ₹18,000 వసూలుకు ప్రతిపాదించినట్లు తెలిసింది.

మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ

Image
మంచిర్యాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనం --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... మంచిర్యాల పట్టణంలో సురభి ఏసీ ఫంక్షన్ హాల్ లో గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఆయన చేస్తున్న నిరంతరం ప్రచారంలో విశేషమైన స్పందన వస్తుందని తెలిపారు.

ఆర్కేపిలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు

Image
ఆర్కేపిలో భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలు.. --  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి ఆర్.లక్ష్మణ్,పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ ప్రసంగం --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్...  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చెన్నూరు నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సిపిఐ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ-99 వసంతాలు పూర్తిచేసుకోని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ పార్టీ యొక్క నియోజకవర్గ జనరల్ బాడీ మీటింగ్ ను ఈరోజు చేపట్టారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్,సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ లు హాజరైనారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు సిపిఐ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఆర్కేపీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్,నాయకులు ఏం.పౌలు,సిపిఐ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు,పార్టీ కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

తవక్కల్ హై స్కూల్ చైర్మన్ అజిజ్ 57వ జన్మదినంతో రక్తదానం

Image
---  తవక్కల్ హై స్కూల్ చైర్మన్ అజిజ్ 57వ జన్మదినంతో రక్తదానం ---  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... ---  తవక్కల్ స్కూల్ గ్రౌండ్ లో రక్తదానం చేసిన దాతలు  ---   తవక్కల్ స్కూల్ చైర్మన్ అజిజ్,కాంగ్రెస్ నాయకులు పల్లెరాజు,రఘునాథ్ రెడ్డి,గాండ్ల సమ్మయ్య ప్రసంగం  మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తవక్కల్ ఉన్నత పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి.అబ్దుల్ అజీజ్ 57వ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ప్రోగ్రాం నిర్వహించారు.ఆ పాఠశాల గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కార్యక్రమంలో రక్తదాతలు అక్కడికి చేరుకొని వాళ్ల యొక్క అమూల్యమైన రక్తంను దానం చేశారు.ఈ సందర్భంగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి.అబ్దుల్ అజీజ్,కాంగ్రెస్ పార్టీ రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు,పిసిసి సెక్రెటరీ పి.రఘునాథరెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్యలు మాట్లాడారు.అబ్దుల్ అజీజ్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ క...

ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా

Image
ఢిల్లీ సిఎంగా రేఖా గుప్తా --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది.కొద్దిసేపటిక్రితం సమావేశమైన బీజేపీ శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది.షాలిమర్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంగా ఎన్నుకున్నారు.రేపు రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ,కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.ఢిల్లీ సీఎం ఎంపిక కోసం కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బీజేపీ జాతీయ కార్యదర్శి ఓపీ దన్కర్‌ను బీజేపీ అధిష్టానం నియమించింది.ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఈ ఇద్దరు పరిశీలకులు శాసనసభ్యుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అదే సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని సభ్యుల ముందుంచారు. చివరిగా ఏకగ్రీవంగా రేఖా గుప్తా పేరును ఢిల్లీ సీఎంగా ఎన్నుకున్నారు.

అందరూ రక్తదానం చేయాలి - ఆరోగ్యంతో ఉండాలి

Image
అందరూ రక్తదానం చేయాలి - ఆరోగ్యంతో ఉండాలి 20న- రేపు ఆర్కేపి తవక్కల్ పాఠశాలలో రక్తదాన శిబిరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల తవక్కల్ ఉన్నత పాఠశాలలో గురువారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి.అబ్దుల్ అజీజ్ యొక్క 57వ జన్మదినo పురస్కరించుకొని సంబంధిత రక్తదాన శిబిరం స్థానిక తవక్కల్ మెయిన్ స్కూల్ లో ఏర్పాటు చేశారు.మంచిర్యాల జిల్లాలోని తల సేమియా,సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులతోపాటు ఇంకా ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరం ఉన్న వాళ్ళ కోసం అటుపిమ్మట ప్రజలకు అత్యవసర రక్తం కోసం ఆ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు.ప్రధానంగా చెప్పాలంటే సాటి తోటి మనిషిని రక్షించే రక్త దానం చేయడమంటే మహాదానంగా మనందరికీ తెలిసిందే.అయితే మంచిర్యాల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చేపడుతున్న ఆ బ్లడ్ డొనేట్ క్యాంప్ కు జిల్లాలోని రక్త దాతలు యువకులు రక్తం ఇవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా అధిక సంఖ్యలో నిర్ణీత సమయంలో హాజరై రక్తదానం చేయాలని రామకృష్ణాపూర్ పట్టణంలోని సాంఘిక సేవ సంఘకర్త ఎండి.పాషా,తవక్కల్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ కోరారు.అంతేకాకుండా అత్యవసర సమయం...

మంచిర్యాలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటన

Image
మంచిర్యాలలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యటన --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మంచిర్యాల పట్టణంలోని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్,పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి,సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి,రావుల రామనాథ్,చల్లా నారాయణ రెడ్డి పాల్గొన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్  మాట్లాడుతూ ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.బిజెపి అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ పార్టీ కుల గణన పేరుతో బీసీలను మోసం చేస్తుందని హిందువుల జనాభా తక్కువ చేసే చూపే ప్రయత్నం చేస్తుందని బీసీలు అందరూ ఏకం అయ్యి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి...