Posts

ఆర్కేపిలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ-ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

Image
ఆర్కేపిలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ-ఘనంగా మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు  తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం దినపత్రిక... రామకృష్ణాపూర్ న్యూస్,జులై-7,తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం పేపర్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల క్యాతనపల్లి మున్సిపాలిటీ-రామకృష్ణాపూర్ పరిధిలోని సూపర్ బజార్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ 32వ జెండా పండుగతో పెద్ద ఎత్తున వాళ్ల యొక్క సంబంధిత పతాకం  ఆవిష్కరణ చేశారు.ఆ క్రమంలో చూస్తే..పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పుట్టినరోజు పురస్కరించుకొని ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు రాచర్ల సరేష్ మాదిగ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు కూడా పట్టణానికి చెందిన మాదిగ దండోరా శ్రేణులు ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.తదానంతరం గర్ల్స్ హైస్కూల్లో విద్యార్థినిలకు పరీక్ష ప్యాడ్లు, పండ్లు  పంపిణీ చేసారు.ఆ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ నాయకులు పుల్లూరు కళ్యాణ్,ఆరుముల్లపోశం,కాదాసీ సంపత్,కన్నూరి రాజేందర్,ఆవునూరి గట్టయ్య,రామిల్లమల్లేష్,దాసరపు ఆగయ్య,మారపల్లి రాజయ్య,ఎల్లసాని శ్రీనివాస్,సలిగోమ్ముల రమేష్,ఎంఎస్ఎఫ్ నాయకులు మారపల్లి సాయికుమార్,రేణిగుంట్...

మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం...

Image
మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం... జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం: జూలై- 4 పెద్దపల్లి ప్రతినిధి :మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి తెలిపారు.శనివారం జిల్లా రెవెన్యూ అధికారి సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్దంతి,కొణిజెటి రోశయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి దొడ్డి కొమురయ్య,కొణిజెటి రోశయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి మాట్లాడుతూ,దొడ్డి కొమురయ్య సాయుధ పోరాటంలో నేల రాలిన తొలి అమరుడని,నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛ వాయువులు పీల్చేందుకు ఆత్మ గౌరవ పతాకాన్ని ఎగుర వేసేందుకు ప్రాణాలు పణంగా పెట్టిన గొప్ప యోధుడు కొమురయ్య అని , ఆయన చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని  తెలిపారు.కొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారని,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జ...

గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు-బర్లకు తీవ్ర గాయాలు?

Image
గోదావరి ఒడ్డున పేలుడు పరికరాలు-బర్లకు తీవ్ర గాయాలు?  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్.. జన్నారం న్యూస్,ఏప్రిల్ -20: మంచిర్యాల జిల్లా జన్నారం_ మండల కేంద్రంలోని బాదంపల్లి గ్రామ సమీపంలో గోదావరి నది ప్రవాహ ఒడ్డున ఆదివారం ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది.ఆ వన్యప్రాణులను వేటాడేందుకు గుర్తుతెలియని వేటగాళ్లు పేలుడు పరికరాలు అమర్చినట్లు సమాచారం గుండా తెలిసింది.ఆ గ్రామానికి చెందిన పశువుల కాపరులు తమ బర్లను మేత కోసం గోదావరి తీర ప్రాంతానికి తీసుకువెళ్లగా అక్కడ మేత కోసం తిరుగుతున్న బర్లలో కొన్ని ఆ పేలుడు పరికరాలను తినడంతో ఒక్కసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి.ఆ ఘటనలో పలు బర్లకు తీవ్ర గాయాలు కావడంతో కాపరులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.గాయపడిన పశువులను సమీపంలోని వెటర్నరీ వైద్యుల వద్ద చికిత్సకు తరలించారు.ఆ ఘటనతో గ్రామస్థుల్లో భయం నెలకొంది.వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఇలాంటి ప్రమాదకర పేలుడు పరికరాలు అమర్చడం వల్ల నిరపరాధ పశువులు బలవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సంబంధిత అటవీ శాఖ అధికారులు,పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పున:రావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్ర...

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” పథకం ప్రారంభించింది-కేటీఆర్

Image
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ “దోచుకో-దాచుకో” అనే పథకం ప్రారంభించింది  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకే ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోచుకుంటున్నారు  కాంగ్రెస్ పార్టీ అంతా అవినీతిమయం  రేవంత్ రెడ్డి అంతా భారీ అవినీతిపరుడు దేశంలో ఇంకొకరు లేరు  బీజేపీ-కాంగ్రెస్ తోడు దొంగల మాదిరి కలిసి నడుస్తున్నాయి  అందుకే సింగరేణి నుంచి మొదలుకొని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపైన విచారణ లేదు  ప్రధానమంత్రి ఆర్ఆర్ టాక్స్ , హోంమంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం అని చెప్పినా ఇప్పటిదాకా ఒక ఎంక్వయిరీ లేదు  అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపి కలిసి ఒకరిని ఒకరు కాపాడుకుంటున్నాయి  సింగరేణి కార్మికుల కోసం కొట్లాడుతాం  కార్మికుల సమస్యలు పట్టించుకోకుంటే…సింగరేణిలో అవినీతి ఆపకుంటే…ప్రతి బొగ్గు గనిమీద అగ్గిపుట్టిస్తాం…. తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక..... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో క్యాతన పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను సన్మాంచిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.ఆ సందర్భంగా కేటీఆర్ మ...

విలేకరి ముసుగులో వసూళ్లు?

Image
విలేకరి ముసుగులో వసూళ్లు దందా? కత్తితో బెదిరించి ఫోన్ పే ద్వారా వసూలు వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్,రిమాండ్ బాధితులను బెదిరిస్తే కఠిన చర్యలు తప్పవు వేములవాడ టౌన్ సీఐ వీర ప్రసాద్ హెచ్చరిక తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్... విలేకరుల ముసుగులో కొంత మంది నకిలీ జర్నలిస్టులు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.ఆ క్రమంలో చూస్తే..తాజా గా వేములవాడ పట్టణంలోని ఓక సూపర్ మార్కెట్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నిందితుడిని వేములవాడ టౌన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఆ మేరకు వేములవాడ టౌన్ సీఐ బి.వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన గోడిశేల మహేష్ అనే వ్యక్తి జర్నలిస్టుగా పరిచయం చేసుకుని,సూపర్ మార్కెట్ యాజమానిని భయభ్రాంతులకు గురిచేశాడు.అధికారులతో తనిఖీలు చేయిస్తానని,పత్రికల్లో వ్యతిరేక వార్తలు రాస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.కత్తితో ప్రాణహాని తలపెడతానని హెచ్చరించి బాధితుడి నుంచి ఫోన్ పే ద్వారా రూ.42,000 వసూలు చేశాడు.నిందితుడు మళ్లీ డబ్బుల కోసం వేధిస్తుండటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.ఎస్‌ఐ రామ్మోహన్,కానిస్టేబుల్ గ...

బైకు అదుపుతప్పి ఆ ఇద్దరికీ గాయాలు?

Image
బైకు అదుపుతప్పి బొక్కలగుట్ట జాతీయ రహదారిపై ఆ ఇద్దరికీ గాయాలు  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-11,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.ఆ ఘటనలో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇంకా మరిన్ని వివరాలు కోసం ప్రతినిత్యం వీక్షిస్తూనే ఉండండి.తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక పేపర్-టీవీ ఛానల్ న్యూస్.

వాటర్ బిల్లు పేరుతో సైబర్ మోసాలు-సిపి సజ్జనార్ హెచ్చరిక

Image
వాటర్ బిల్లు పేరుతో సైబర్ మోసాలు-సిపి సజ్జనార్ హెచ్చరిక తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... హైదరాబాదు న్యూస్, ఏప్రిల్-11,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక టీవీ ఛానల్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను ఎంచుకొని ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు.ఆ క్రమంలో చూస్తే..నగరవాసులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వాటర్ బిల్లుల పేరుతో కొత్త తరహా మోసాలకు తెరలేపారు."మీ నీటి బిల్లు బకాయి ఉంది.వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం"అంటూ వాటర్ బోర్డు (HMWSSB) అధికారుల పేరుతో ఫోన్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.ఆ సైబర్ నేరగాళ్లు బిల్లు అప్డేట్ పేరుతో HMWSSB WATER BILL UPDATE.apk పంపి, దానిని ఇన్స్టాల్ చేయాలని నమ్మిస్తున్నారు.ఒక్కసారి ఆ ఏపీకే ఫైల్ను ఫోన్లో డౌన్లోడ్ చేస్తే..మీ మొబైల్ నియంత్రణ మొత్తం కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని దాంతో వాళ్లు మీ కాల్స్ను డైవర్ట్ చేయడమే కాకుండా బ్యాంక్ ఓటీపీలను తస్కరించి క్షణాల్లో ఖాతాలను ఖాళీ చేస్తున్నారని ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ అలర్ట్ గా ఉండాలని ప్రకటిం...

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరికి గాయాలు?

Image
ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్..ఆర్కే-5 గనిలో ప్రమాదం-ఇద్దరిలో ఒకరికి గాయాలు,మరొకరికి తీవ్ర గాయాలు! తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... శ్రీరాంపూర్ న్యూస్,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్-టీవీ ఛానల్ న్యూస్,ఏప్రిల్-9:సింగరేణి కాలరీస్ లోని శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోగల ఆర్కే ఐదు గనిలో గురువారం రెండవ షిఫ్ట్ లో జరిగిన ఒక ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.ఆ క్రమంలో చూస్తే...గని భూగర్భంలో వేల్డర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ అనే కార్మికుడు ఇనుప రాడ్లను వెల్డింగ్ చేస్తున్న సమయంలో దాంట్లో ఒక చిన్న రాడ్ చువ్వలు మిరుగులు వెళ్లి అక్కడే ఉన్న పాత పూర్ణికి తగలడంతో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందనీ తెలుస్తుంది.ఆ ప్రమాదంలో వేణుగోపాల్ పై బ్లాస్టింగ్ వల్ల ఒక్కసారిగా బొగ్గు పిల్లలు ఇనుపరాడులు అన్ని కూడా మీద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.అలాగే అతని హెల్పర్ కు కూడా స్వల్పంగా గాయాలు పాలయ్యాడు. వెంటనే రామకృష్ణాపూర్ లోని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించడంతో ఆ ఇద్దరు కార్మికులు చికిత్స పొందుతున్నారు.దాంట్లో వేణుగోపాల్ కు బలమైన గాయాలు కావడంతో ఎక్స్రేలు తీసారు.ఆయన దేహంలో చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉన్నట్లుగా వైద...

2-లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ

Image
2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసిబికి పట్టుబడ్డ సిఐ,ఎస్ఐ  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... హైదరాబాద్ న్యూస్,ఏప్రిల్-8,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్:నకిలీ పాస్ పోర్ట్ కేసులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ సంపతి కనకయ్య,ఎస్సై సిద్దేశ్వర్,రూ.రెండు లక్షలు లంచం తీసుకుం టూ ఏసీబీ అధికారులకు మంగళవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.ఆ క్రమంలో చూస్తే...ఆ దాడులు మంగళ వారం సాయంత్రం ప్రారంభ మై అర్ధరాత్రి వరకు కొనసాగాయి.రంగారెడ్డి జిల్లా ఏసీబీ డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం చూస్తే..కేరళకు చెందిన ఒక వ్యక్తి ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ తో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తూ ఇటీవల కాలంలో అతను పట్టు పడ్డాడు.శంషాబాద్ ఔట్  పోస్ట్ పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు  నమోదు అయింది.అతడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.కొద్దిరోజుల తర్వాత జైలు నుంచి అతడు రిలీజ్ అయ్యాడు.ఆ నేపథ్యంలోనే అతడు ప్రతి వారం పోలీస్ స్టేషన్ కు హాజరవుతున్నాడు.ఆ కేసులో ఛార్జ్ సీట్ ధాఖలు  చేయడానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ కనుకయ్య ఎస్సై సిద్ధేశ్వర్ తో కలిసి ఆ బాధితుడి నుంచి...

9 మంది పోలీసులకు ఉరిశిక్షలో తమిళనాడు హెడ్ కానిస్టేబుల్ రేవతి కీలక సాక్షి!

Image
తమిళనాడులో హెడ్ కానిస్టేబుల్ రేవతి కీలక సాక్షి -- తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక న్యూస్.... ఏప్రిల్-8,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో 9 మంది తోటి పోలీసులకు ఉరి శిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షిగా రేవతి ఉంది.ఒక సందర్భంలో మనసాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ ఇది.తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన.కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతిగా ఉంది.ఆ సంఘటన జరిగిన తర్వాత స్టేషన్‌లో పరిస్థితి ఎలా ఉందంటే జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.ఆ సాక్ష్యాలను తుడిచేయాలి,కథను మార్చాలనీ ఇవే ప్రధాన లక్ష్యాలుగా మారిపోయాయి.ఆ సమయంలో చాలా మంది పోలీసులు సైలెంట్‌గా ఉండటాన్నే సేఫ్‌గా భావిస్తారు.కానీ రేవతి  ఆ ఆప్షన్ తీసుకోలేదు ఆమెకి అది కేవలం డ్యూటీ విషయం కాదు.ఆమె కళ్లముందు జరిగిన దారుణానికి స్పందించాల్సిన బాధ్యత.తోటి సిబ్బంది ఒకవైపు పైఅధికారుల ఒత్తిడి మరోవైపు ఆలాంటి పరిస్థితిలో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. యినా ఆమె వెనక్కి తగ్గలేదు.మేజిస్ట్రేట్ ముందు చెప్పిన ప్రతి విషయం కేసు ది...

సూర్యపేట ఆపిల్ స్కాన్ సెంటర్ పై(సువో మోటో)విచారణ

Image
సూర్యపేట ఆపిల్ స్కాన్ సెంటర్ పై(సువో మోటో)విచారణ  -- తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక... తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సూర్యాపేటలోని ఆపిల్ స్కాన్ సెంటర్‌లో జరిగిన అనైతిక కార్యకలాపాలపై స్వయంగా(సువో మోటో)విచారణ చేపట్టి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.ఆ విచారణలో డా.కిరణ్ కుమార్ సోమ(రిజిస్ట్రేషన్ నం.59019)తాను గుర్తింపు పొందిన అర్హతలు లేకపోయినా,తాను క్వాలిఫైడ్ రేడియాలజిస్టుగా తప్పుడు విధంగా పరిచయం చేసుకున్నట్లు నిర్ధారించబడింది.అలాగే అతను గడువు ముగిసిన రిజిస్ట్రేషన్‌తో వైద్య సేవలు కొనసాగించడమే కాకుండా,తప్పుడు పత్రాలు సమర్పించిన వ్యవహారంలో కూడా పాల్గొన్నట్లు తెలిసింది.ఈ ఉల్లంఘనలను దృష్టిలో ఉంచుకుని,కౌన్సిల్ అతని పేరును మెడికల్ రిజిస్టర్ నుంవంచి రెండు సంవత్సరాల పాటు తొలగించాలని ఆదేశించింది.ఆ విషయానికి సంబంధించి డా.షేక్ జుల్ఫకర్ అలీ(రిజి. నం. 62456) చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందించినట్లు తేలింది.దానికి సంబంధించి,కౌన్సిల్ అతనిపై సెన్సర్ తీవ్రమైన హెచ్చరిక విధించింది.

ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు- మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

Image
ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక.... ఏప్రిల్ 6,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో సంబంధిత తండ్రికొడుకులు మరణించారు.ఆ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మరణానికి కారణమైన ఆ తొమ్మిది మంది పోలీసులకు సోమవారం మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో సంబరాలతో ఈస్టర్ పండుగ వేడుకలు!

Image
యేసుక్రీస్తు ప్రభువు పున:రుత్థానుడై మూడవరోజు మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు  - ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో సంబరాలతో ఈస్టర్ పండుగ వేడుకలు - యేసు సిలువపై కొవ్వొత్తులతో విరజిల్లే వెలుగు దీపాలు  - పాస్టర్ ఎం జాషువా దైవ సందేశం... - తెలంగాణ జర్నలిస్టు పేపర్... రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-5,తెలంగాణ జర్నలిస్టు న్యూస్ పేపర్-తెలంగాణ టీవీ ఛానల్ న్యూస్: ప్రపంచ మానవాళిని రక్షించడానికి సిలువ వేయబడిన పరిశుద్ధుడైన యేసు క్రీస్తు ప్రభువు పున:రుత్తానుడై మూడవ దినము తిరిగి లేచాడు.ఆ క్రమంలో చూస్తే...మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సిఎస్ఐ-సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం ఈస్టర్ పండుగ వేడుకలు భారీ ఎత్తున నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే ఉదయం నాలుగు గంటలకే క్రైస్తవులు ఆలయానికి చేరుకొని ఏసుక్రీస్తు ప్రభువుకు మహిమ కనపరిచే విధంగా భక్తిశ్రద్ధలతో అత్యంత విశ్వాసంతో ఆరాధించారు. ఆ సందర్భంగా చర్చి దైవ సేవకులు రేవా.పాస్టర్ ఎం.జాషువా దేవుని సందేశంను ఆయన ప్రసంగం ద్వారా వివరించారు. కాగా ఏసుక్రీస్తు ప్రభువు మరణమును జయించి సజీవుడుగా ప్రత్యక్షమయ్యాడనీ గుర్తు చేశారు.అయితే బాధలో ఉన్న వారందరికి ఆ క్రీస...

గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు

Image
గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తి అరెస్టు ఐదు మొక్కలు స్వాధీనం తెలంగాణ జర్నలిస్టు న్యూస్... సుల్తానాబాద్ న్యూస్ ఏప్రిల్ 4 జర్నలిస్టు దినపత్రిక-మీడియా న్యూస్ పెద్దపల్లి జిల్లా బ్యూరో: పెద్దపల్లి జిల్లాసుల్తానాబాద్ మండలం ఆరేపల్లి గ్రామ శివారులో గల సాయిరాం బ్రిక్స్‌లో ఒక వ్యక్తి గంజాయి మొక్కలు పెంచుతున్నాడనే సమాచారం మేరకు ఈరోజు సుల్తానాబాద్ ఎస్ఐ తన సిబ్బందితో పాటు మండల వ్యవసాయ అధికారి పైడితల్లితో కలిసి సాయిరాం బ్రిక్స్‌లో తనిఖీ నిర్వహించారు.ఆ తనిఖీల సమయంలో అక్కడ గంజాయి మొక్కలు పెంచుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.ఒడిశా రాష్ట్రానికి చెందిన సుకల్పరబోయి అనే వ్యక్తి గత ఐదు నెలల క్రితం సాయిరాం బ్రిక్స్‌లో పనిచేయడానికి వచ్చాడు.గంజాయి సేవించే అలవాటు ఉండడంతో తన వెంట తెచ్చుకున్న గంజాయి గింజలను నాటి మొక్కలను పెంచుతున్నట్లు తెలిసింది.ఈ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఐదు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసిన ఐదు మొక్కల విలువ సుమారు రూ.50,000 వరకు ఉంటుందని అంచనా.

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో గంభీరంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

Image
ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో నమ్మకంగా గుడ్ ఫ్రైడే వేడుకలు   ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో నమ్మకంగా గుడ్ ఫ్రైడే వేడుకలు  -  తెల్లటి వస్త్రాలు ధరించిన  క్రైస్తవులు ప్రార్థించారు  -  రెవరెండ్ పాస్టర్ ఎం.జాషువా దైవ సందేశం -  తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్.. రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-3,తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్- తెలంగాణ జర్నలిస్టు టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సెయింట్ పీటర్స్-సిఎస్ఐ చర్చిలో శుక్రవారం గుడ్ ఫ్రైడే(శుభశుక్రవారం)వేడుకలు చాలా విశ్వాసంతో ఎంతో నమ్మకంగా క్రైస్తవ సోదరీ సోదరులు భారీ ఎత్తున నిర్వహించుకున్నారు.ఆ క్రమంలో చూస్తే... సి ఎస్ ఐ చర్చి పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన పాటలు గేయాలతో అత్యంత భక్తిశ్రద్ధలతో గొప్ప విశ్వాసంతో ఘనంగా చేపట్టారు.ఆ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభువు సిలువలో మరణించినప్పుడు ఆయన చివరిసారిగా మాట్లాడిన ఆ ఏడు మాటలను క్రైస్తవ సోదరీ సోదరులు బైబిల్ లోని వాక్యాల ద్వారా దేవాలయంలో చదివి వినిపించారు.దాంట్లో చూస్తే... పర...

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి?

Image
జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి? తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... ఏప్రిల్-2,బాలానగర్,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్-టీవీ ఛానల్ న్యూస్: నీ అభిమానులము మేము అని నమ్మించి జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై ఎనిమిది మంది ఏకంగా దాడి చేశారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.అయితే మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.

బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం!

Image
బిసి మహిళలకు రిజర్వేషన్ లలో సబ్ కోటాకై అమరణ దీక్షకు సిద్ధం! తెలంగాణ జర్నలిస్టు డైలీ న్యూస్ పేపర్-టీవీ ఛానల్ న్యూస్... మంచిర్యాల న్యూస్,మార్చి-30:బిసి కులాల ఉద్యమ పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పేరం అలేఖ్య హైకోర్టు ప్రముఖ న్యాయవాది తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ లో బీ జే పీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా రిజర్వేషన్ బిల్లులో 33 శాతానికై ఆగ మేఘాల మీద రెండు రోజులు పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లును ఆమోదించడం జరిగినది. ఈ బిల్లులో బీసీ మహిళలకు అవకాశం లేకుండా అగ్రవర్ణాల వాళ్లకు ఉపయోగపడే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు. దీనిని స్వతంత్ర భారతదేశంలోని 80 కోట్ల బీసీ జనాభాలో 40 కోట్ల మంది బీసీ మహిళలము వ్యతిరేకిస్తున్నాము.  ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును 2027లో అమలు చేయటానికి ఆమోదం పొందటానికి మళ్లీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపయోగపడే విధంగా 33 శాతంలో అర్ధ భాగం 16- 1/2 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుత...

ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు

Image
ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు ఆర్కేపి సిఎస్ఐ చర్చిలో అత్యంత వైభవంగా మట్టల ఆదివారం వేడుకలు -  పాస్టర్ రెవారెండ్ ఎం.జాషువా దైవ సందేశం అందించారు -  తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్  రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-29,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పట్టణంలోని సీఎస్ఐ సెయింట్ పీటర్స్ చర్చి దేవాలయంలో ఆదివారం మట్టల ఆదివారం మహోత్సవం వేడుకలు ఆ చర్చి క్రైస్తవులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆ క్రమంలో చూస్తే..సిఎస్ఐ మెదక్ డయాసిస్ సంఘంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సెయింట్ పీటర్స్ చర్చి బ్రాంచ్ దైవజనులు పాస్టర్ రెవరెండ్ ఎం.జాషువా ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు ఆ సంఘానికి చెందిన క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు.ఆ నేపథ్యంలోనే పట్టణంలోని యూనియన్ బ్యాంకు ముందు గల సిఎస్ఐ చర్చి దేవాలయం నుంచి స్థానిక అంబేద్కర్ అంగడి బజార్ వద్దకు సీఎస్ఐ చర్చి క్రైస్తవులు కొబ్బరి మట్టలు చేత పట్టుకొని పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి ఊరేగింపు చేశారు.దాంతో క్రైస్తవులందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఇద్దరేసి చ...

విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్ఐ

Image
విద్యార్థినిగా మారి ఆకతాయిలకు చెక్ పెట్టిన మహిళా ఎస్సై విద్యార్థినుల భద్రత కోసం వినూత్న చర్యలు  పోలీసులపై ప్రజల్లో పెరిగిన నమ్మకం తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్  భూపాలపల్లి న్యూస్ :జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది.టేకుమట్ల మహిళా ఎస్సై అమూల్య,విద్యార్థిని వేషధారణలో పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యక్షమై ఆకతాయిల ఆటకు చెక్ పెట్టారు.పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని స్వయంగా తెలుసుకుని చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం వదిలి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు డ్రెస్సులో చేతిలో పుస్తకాలు పట్టుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లారు.విద్యార్థినుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, పరీక్షా కేంద్రాల వద్ద పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ చర్యతో అక్కడి పరిసరాల్లో శాంతి నెలకొనడంతో పాటు, విద్యార్థినులు ధైర్యంగా పరీక్షలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడింది.మహిళల భద్రతకు పోలీసులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ ఘటన మర...

ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్'

Image
ఆర్కేపి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 'అరైవ్ అలైవ్' ప్రోగ్రాం పట్టణ ఎస్ఐ జే.శ్రీధర్ సూచనలు జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్,మార్చి-26,జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన 'అరైవ్ అలైవ్' ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ లోనీ సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సంబంధిత ప్రోగ్రాం నిర్వహించారు.ఆ సందర్భంగా  పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జే.శ్రీధర్ ఆసుపత్రిలోని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు.అయితే మోటార్ సైకిల్ పై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,ఫోర్ వీలర్ దారులు సీటు బెల్టు తప్పకుండా పెట్టుకోవాలని గుర్తు చేశారు.అలాగే వాహనంకు సంబంధించిన పత్రాలు కలిగి ఉండాలని సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు,క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.దాంట్లో ముఖ్య అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.చిన్నపిల్లలకు టూవీలర్-ఫోర్ వీలర్ ఇవ్వకూడదని,అతివేగంగా ఆజాగ్రత్తగా నడపకుండా చూడాలని వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ప్ర...