Posts

Showing posts from March, 2025

రాజీవ్ యువ వికాస ధరఖాస్తుల తేదీ గడువు పెంచారు

Image
రాజీవ్ యువ వికాస ధరఖాస్తుల తేదీ గడువు పెంచారు - జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... మంచిర్యాల న్యూస్ మార్చి-31 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : తెలంగాణలో యువతకు ఆర్థిక చేయూత అందించేందుకు రాష్ట్ర ప్రభత్వం ప్రవేశ పెట్టిన కీలక పథకం "రాజీవ్ యువ వికాస"(Rajeev Yuva Vikasa) గా ఉంది.అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్ 5గా ప్రకటన చేశారు.ఆ ధరఖాస్తుల స్వీకరణలో రాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.ఈ రాజీవ్ యువ వికాస ధరఖాస్తుల గడువును ఏప్రిల్- 14 తేదీ వరకు పొడిగిస్తూ(Applications Extended) నిర్ణయం తీసుకుంది.ఆ మేరకు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓక ప్రకటన జారీ చేశారు.కాగా ఈ పథకానికి అప్లై చేసుకునే వారికి మరో వెసులుబాటును కూడా కల్పించారు.ఆ నేపథ్యంలోనే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఆదాయ ధృవీకరణపత్రం అవసరం లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ మహిళలు,పురుషులకు ఒక్కొక్కరికి రూ.4 లక్షలకు తగ్గకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది.దానికోసం ఆయా కార్పొరేషన్లకు రూ.6 వేల కోట్ల నిధుల...

ఆర్కేపిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు - ఎమ్మెల్యే జి.వివేక్ ప్రార్ధనలు

Image
ఆర్కేపిలో భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగ వేడుకలు - ఎమ్మెల్యే జి.వివేక్ ప్రార్ధనలు --    షవ్వల్ నెలవంకతో ఉపవాసం విరమించిన ముస్లిం సోదర్లు --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-31 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల పాత పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఈద్గా వద్ద పట్టణ ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో సోమవారం రంజాన్ పండుగ వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకున్నారు.ఆ క్రమంలో చూస్తే..రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో అక్కడి ఈద్గా నందు ముస్లిం సోదరులు నమాజ్ ఆచరించుట కొరకు ఏర్పాట్లు చేసారు.మదీనా మస్జీద్ ఇమామ్ రంజాన్ పండుగ విశిష్టత తెలియచేసి,ఈద్ -ఉల్ -ఫితర్ ఈద్ నమాజ్ బిలాల్ మస్జీద్ ఇమామ్ అబ్దుల్ అజీజ్ నమాజ్ చదివించి ప్రత్యేక ప్రార్ధన చేసారు.అదే విదంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్ కు వ్యతిరేకంగా ఇక్కడి నమాజ్ కు వచ్చిన ముస్లిం సోదరులందరూ కుడి చేతికి నల్ల రిబ్బన్ ధరించి వాళ్...

బ్యాంకాక్ భూకంపంలో క్షేమంగా తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం

Image
బ్యాంకాక్  భూకంపంలో క్షేమంగా తెలంగాణ ఎమ్మెల్యే కుటుంబం --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... హైదరాబాదు న్యూస్, జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ టీవీ న్యూస్ : థాయ్‌లాండ్, మయన్మార్ దేశాల్లో చోటు చేసుకున్న వరుస భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చాయి.ఆ క్రమంలో చూస్తే...శుక్రవారం నాడు సంభవించిన భూకంపాల ధాటికి..వందల నిర్మాణాలు కుప్పకూలాయి.మయన్మార్, థాయ్‌లాండ్ రెండు దేశాల్లో కలిపి వందల మంది మృతి చెందారు.చాలా మంది గాయపడ్డారు.ఆ రెండు దేశాల ప్రభుత్వాలు సహాయక కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి.జనాలు భయంతో ప్రాణాలు గుప్పిట్లో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.తెలంగాణ రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం బ్యాంకాక్‌లో చిక్కుకుపోయారు.వారు క్షేమంగా ఇంటికి చేరాలని ఎమ్మెల్యేతో పాటు ఆయన కుటుంబ సభ్యులు,అభిమానులు,పార్టీ కార్యకర్తలు ప్రార్థించారు. అయితే వాళ్ల యొక్క ఆకాంక్షలు ఫలించాయి.దాంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు అక్కడి ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు.ఆ నేపథ్యంలోనే శనివారం మధ్యాహ్నం..శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు.భార్యాబిడ...

ఆర్కేపిలో వన్ నేషన్ --వన్ ఎలక్షన్ పై బిజెపి వర్క్ షాప్

Image
ఆర్కేపిలో వన్ నేషన్ --వన్ ఎలక్షన్ పై బిజెపి వర్క్ షాప్   --  ముఖ్యఅతిథి బిజెపి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గౌడ్ మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల బిజెపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై వర్క్ షాప్ ఎట్టకేలకు నిర్వహించారు.ఆ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ హాజరైనారు.ఆ ప్రోగ్రాంకు ముందుగా పట్టణంలో సూపర్ బజార్ చౌరస్తాలో టపాకాయలు పేల్చి భాజాపా శ్రేణులు ముఖ్యఅతిథికి స్వాగతం పలికారు.అనంతరం బిజెపి ఆఫీసు చేరుకొని అక్కడి ఆఫీసులో వన్ నేషన్--వన్ ఎలక్షన్ పై వర్క్ షాప్ నిర్వహించారు.ఆ సందర్భంగా ముఖ్యఅతిథి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ...వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై అక్కడి వర్క్ షాప్ లో అందరికీ అవగాహన కల్పించారు.అదేవిధంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ రైల్వే  ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవ జాప్యం ఇంకా నిర్లక్ష్యంపై పాలకుల పనితీరుపై ఆయన విమర్శల వర్షం కురిపించారు.ఆ సందర్భంగా భాజపా పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఆ కార్యక్రమంలో బిజెపి రామకృష్ణాపూర్ పట్టణ అధ్యక్షులు ఠాకూర్ ధన్ సింగ్ జిల్లా ...

తెలంగాణలో మండుతున్న ఎండలు

Image
తెలంగాణలో మండుతున్న ఎండలు   హైదరాబాద్ న్యూస్ మార్చి-28 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండల తీవ్రత పెరుగుతుంది.ఆ క్రమంలో చూస్తే..దాని ప్రభావంతో వడ గాలులు కూడా జోరుగానే వీస్తున్నాయి.ఇక నేడు తెలంగాణలోని15 జిల్లాలకు హైదరాబాద్ లోని వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.ఆదిలాబాద్,కొత్తగూడెం,జగిత్యాల,జయశంకర్ భూపాలపల్లి,జోగులాంబ గద్వాల్,ఖమ్మం,కొమరంభీం,మంచిర్యాల,ములుగు,నాగర్ కర్నూల్,నారాయణపేట్,నిర్మల్,నిజామాబాద్,పెద్దపల్లి,వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరికలు జారీ చేశారు.అయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గరిష్టంగా 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటి పోతున్నాయి.నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఉత్తర తెలంగాణలోని పలు జిలాల్లో 45 డిగ్రీల వరకు టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉంది.అయితే ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.అవసరం అయితేనే తప్పా ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. బయటకు వెళ్ళినప్పుడు టోపీ,గొడుగులు లాంటివి ఉపయోగించాలని హెచ్చరించారు.కాగా ఈ రోజు నుంచి మరో మూడు ర...

ఏప్రిల్-3న సిఎం రేవంత్ రెడ్డి..మంత్రివర్గ విస్తరణ?

Image
 ఏప్రిల్-3న సిఎం రేవంత్ రెడ్డి..మంత్రివర్గ విస్తరణ? -  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ ఆమోదం హైదరాబాద్ న్యూస్ మార్చి-26 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ దిశగా వేగంగా సాగుతుంది.ఆ క్రమంలో చూస్తే...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు దీరి దాదాపు యేడాదిన్నర కావస్తోంది.2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.దాంతో మంత్రి వర్గ విస్తరణ ఇప్పటివరకూ జరగలేదు.తాజాగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపింది.ఆ నేపథ్యంలోనే ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది.అయితే ఇద్దరు బీసీలు,రెడ్డి,ఎస్సీకి తెలంగాణలోని మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది.కాగా రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది.ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి,పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి అభిప్రాయాలు సేకరించింది.ఆ తరుణంలో రేవంత్ వద్దే కీలక శాఖలు హోం,మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌,అర్బన్‌ డెవలప్‌మెంట్‌,విద్య,జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంట...

మంచిర్యాల ఆర్యవైశ్య భవన్ లో రేపు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం

Image
మంచిర్యాల ఆర్యవైశ్య భవన్ లో రేపు ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం మంచిర్యాల వాసవిక్లబ్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని ఆర్యవైశ్యభవన్లో ఈ నెల 27వ తేదీ హైదరాబాద్ యశోదా ఆసుపత్రి హైటెక్ సిటీ వారి సహకారంతో ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరంను  చేపడుతున్నారు. ఆ క్రమంలో చూస్తే..మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాలతో పాటు పరిసర ప్రాంతంలోని ప్రజలు అంటే మంచి సదవకాశంను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అయితే మోకాళ్ళ నొప్పులు,ఆర్థోపెడిక్ వైద్య చికిత్సలు అందిస్తున్నాట్లు ఆ ఉచిత మెగా వైద్య శిబిరం గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ -;మోకాళ్ళ మార్పిడి సర్జన్ డాక్టర్ సిఆర్ హరీష్,యశోద ఆసుపత్రి వైద్యుల సహకారంతో వైద్య శిబిరం కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.ఆ నేపథ్యంలోనే వాసవిక్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన సంబంధిత ఉచిత మెగా ఆర్థోపెడిక్ వైద్య శిబిరంను విజయవంతం చేయాలని కోరారు.

అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు

Image
అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు  ఆర్కేపి ఎస్ ఐ జి.రాజశేఖర్ రామకృష్ణాపూర్ లో నివసించే ఒక వ్యక్తి 10 సంవత్సరాల బాలిక యొక్క నోరుమూసి ఆ అమ్మాయిని అతని ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు మంగళవారం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.రాజశేఖర్ తెలిపారు.ఆ క్రమంలో చూస్తే..అమ్మాయి యొక్క తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ వ్యక్తి పై(పి ఓ సి ఎస్ ఓ) కేసు నమోదు చేసి అతని కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు హాజరు పరిచినట్లు ప్రకటించారు. -- యువత మొబైల్స్ కు బానిసలుగా ఉండకూడదు నేటి యువత మొబైల్స్ కు బానిసలుగా మారిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఇంకా జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్ఐ జి.రాజశేఖర్ తెలిపారు. పట్టణంలోని సెయింట్ జాన్స్ స్కూల్లో పోలీసులు కమ్యూనిటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు అనేక విషయాలను గుర్తు చేశారు. కాగా మొబైల్స్ లలో గుర్తుతెలియని వెబ్సైట్స్ లను వాటి ద్వారా వచ్చిన వెబ్ లింక్స్ లను  ఓపెన్  చేయడంతో అస్లీలమైన వీడియోలను చూస్తున్నారని దానివలన నేరాలకు పాల్పడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అనే ప...

పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం?

Image
పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానం? పాస్టర్ ప్రవీణ్ మరణం రోడ్డు ప్రమాదమా లేక హత్య --  ఆర్కేపి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం ప్రకటన రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-25 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : పాస్టర్ పగడాల ప్రవీణ్  మరణం అసలు రోడ్డు ప్రమాదమేనా ? లేక మతోన్మాద హత్యనా? ఆ విషయంలో విచారణ చేసి పోలీసులు ఇంకా ప్రభుత్వం తేల్చాలని రామకృష్ణాపూర్ యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం కమిటీ డిమాండ్ చేసింది.ఆ క్రమంలో చూస్తే..సోమవారం రాత్రి పాస్టర్ ప్రవీణ్  విజయవాడ నుంచి బయలు దేరి రోడ్డు మార్గంలో రాజమండ్రికి వస్తూండగా రహదారిలో ఆ దారి ప్రక్కన చెట్ల పొదల్లో పాస్టర్ యొక్క బండితో సహా అతని మృత దేహం పడి ఉండటం చాలా అనుమానానికి దారి తీస్తుందని ప్రకటించారు.ఆ దుర్ఘటనపై ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోని క్రైస్తవ సమాజానికీ న్యాయం చేయలని ఆర్ కే పి యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం డిమాండు చేస్తుందన్నారు.ఆ పాస్టర్ ప్రవీణ్ నేల రోజుల ముందుగానే ఆయనకు ప్రాణహాని ఉందని కూడా తెలిపినట్లు పేర్కొన్నారు.ఒకవేల ఆక్సిడెంట్ అయితే ఆ రోడ్డు పైనా ఎలాంటి గీతలు లెవని అలాగే సడన్ బ్రేక్లు వెస్తే..టైర్లు రాకినా గీతాలు లెవన్నారు....

రంజాన్ పండుగతో ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్

Image
రంజాన్ పండుగతో ఇఫ్తార్ విందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్  -  ముస్లిం సోదరి,సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-23 జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ : చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల ఏ-జోన్ ప్రాంతంలోని బిలాల్ మసీదులో ఆర్కే-ఒకటి లో గల మసీదులో ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందులో హాజరైనారు.ఆ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ శాసనసభ్యులు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.ఆ నేపథ్యంలోనే ముస్లిం సోదరీ,సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ముస్లిం సోదరులు అందరితో కలిసి ఎమ్మెల్యే వివేక్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.ఆ కార్యక్రమంలో ఆర్ కే పి ముస్లిం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎండి.అబ్దుల్ అజీజ్,సిటీ కేబుల్ సలీం,మైనార్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లాడెన్,ఎండి.పాషా,పిసిసి సెక్రటరీ రఘునాథరెడ్డి,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు,సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య,ముస్లింలకు చెందిన మత గురువులు,ముస్లిం సోదరులు,తదితరులు పాల్గొన్నారు.

సూది లేకుండానే..షుగర్ పరీక్ష!

Image
సూది లేకుండానే..షుగర్ పరీక్ష! రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలవడానికి ప్రస్తుతం సూదిని వాడాల్సి వస్తోంది.అయితే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి)పరిశోధకులు దానికి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారు.చర్మానికి కోతపెట్టాల్సిన అవసరం లేకుండా కాంతి సాయంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కొలిచే మార్గాన్ని కొనుగొన్నారు.ఫొటోఅకౌస్టిక్ పరిజ్ఞానాన్ని ఐ ఐ ఎస్ సి శాస్త్రవేత్తలు ఉపయోగించుకున్నారు.ప్రధానంగా కణజాలంలో గ్లూకోజ్ తీవ్రతను మాత్రమే కొలిచేలా దాన్ని తీర్చిదిద్దారు.దానికోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు. కోసం పోలరైజ్డ్ కాంతిని ఉపయోగించారు.

మందకృష్ణ మాదిగకు క్షీరాభిషేకం చేసిన ఆర్కేపి మాదిగ దండోరా

Image
మందకృష్ణ మాదిగకు క్షీరాభిషేకం చేసిన ఆర్కేపి మాదిగ దండోరా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా అంటే దాదాపు మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన విరోచితమైన పోరాటం కృషి ఫలించాయి.ఆ వర్గీకరణ కోసం న్యాయవ్యవస్థ తీర్పు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది.ఆ విషయాన్ని పరిగణగలోకి తీసుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ లోని సీఎస్పీ ముందు గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు దళిత నాయకులు అందరూ కలిసి ఐకమత్యంతో క్షీరాభిషేకం చేశారు.ఆ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు సరేష్,బిజెపి నాయకులు ఆరు ముళ్ల పోశం,పోచం,జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ చైర్మన్ కలువల శ్రీనివాస్ మాట్లాడుతూ... దళితులను ఉద్దేశించి ప్రసంగించారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ దళితుల కోసం దళిత కుటుంబాల అభివృద్ధి కోసం దళిత...

క్యాతనపల్లి రైల్వే గేటు ఓపెన్ చేసిన అధికారులు

Image
క్యాతనపల్లి రైల్వే గేటు ఓపెన్ చేసిన అధికారులు  --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల క్యాతనపల్లి రైల్వే గేటును శుక్రవారం రైల్వే అధికారులు ఎట్టకేలకు ఓపెన్ చేశారు.ఆ క్రమంలో చూస్తే..గత రెండు రోజుల క్రితం మూసివేసిన ఆ రైల్వే గేటు ఈ నెల 28 తేదీ వరకు మూసి ఉంటుందని ఆ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.ప్రధానంగా రైల్వే గేటు మూసివేతతో పదవ తరగతి పరీక్షలు వ్రాసే విద్యార్థిని,విద్యార్థులకు చాలావరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పదవ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకొని క్యాతనపల్లి రైల్వే గేటును ఓపెన్ చేయాలని కేంద్ర రైల్వే అధికారులు నోటీసు పంపించినట్లు తెలిసింది.ఆ నేపథ్యంలోనే ద్విచక్ర వాహనదారులు నాలుగు చక్ర వాహనదారులు ఆటోలు ఇంకా వాహనాలన్నీ కూడా గతంలో మాదిరిగానే క్యాతనపల్లి రైల్వే గేట్ నుంచి వెళ్లడం రావడం క్రమంగా జరుగుతుంది.క్యాతనపల్లి రైల్వే గేటు ఓపెన్ చేసిన విషయంను అందరు కూడా గమనించాలని జర్నలిస్టు పేపర్ అండ్ మీడియా న్యూస్ ద్వారా తెలుపుతున్నాము.

సురక్షితంగా భూమిపైకి చేరుకున్న సునీతా విలియమ్స్

Image
సురక్షితంగా భూమిపైకి చేరుకున్న సునీతా విలియమ్స్ -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... హైదరాబాద్ న్యూస్  మార్చి 19: భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యోమగామి, బూచ్ విల్మోర్ లు, ఏట్టకేలకు భూమి పైకి చేరుకున్నారు.ఆ క్రమంలో చూస్తే... దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయినా వీరిద్దరూ ఎనిమిది రోజుల మిషన్‌ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి.. వ్యోమనౌకలో సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌ మోర్‌ ఎట్టకేలకు బుధవారం తెల్లవారు జామున భూమీ మీదకుచేరుకున్నారు.వారి కోసం ప్రత్యేకంగా పంపిన స్పేస్‌ ఎక్స్‌ క్రూ-9 డ్రాగన్‌ క్యాప్సూల్‌ మంగళవారం ఉదయం 10.35 గంటలకు ఐఎ్‌సఎస్‌ నుంచి విడిపోయి భూమి దిశగా పయనమైనట్టు నాసా వెల్లడించింది. అందులో సునీత, విల్‌మోర్‌తోపాటు మరో ఇద్దరు వ్యోమగాములు అలెగ్జాండర్‌ గోర్బనోవ్‌ (రష్యా), నిక్‌ హేగ్‌ (అమెరికా) కూడా ఉన్నారు. ఈ నౌక 17 గంటలపాటు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో బుధవారం తెల్లవారు జామున 3.27 గంటలకు దిగిందని,నాసా వెల్లడించింది. గంటక...

క్యాతనపల్లి రైల్వే గేటు 9-రోజులు మూసివేత -గమనించాలి

Image
క్యాతనపల్లి రైల్వే గేటు 9-రోజులు మూసివేత - --   రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటన --   జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... రామకృష్ణాపూర్ న్యూస్ మార్చి-18 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి రైల్వే గేటు ఈనెల-19 నుంచి 28 తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు మంగళవారం ప్రకటించారు.ఆ క్రమంలో చూస్తే..క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆఫీసు పక్కనే ఉన్న సంబంధిత రైల్వే గేటు యొక్క రైల్వే ట్రాక్ లైన్ మరమ్మతులను ఒక రైల్వే ట్రాక్ లైన్ మూడు నెలలకు ఒకసారి చేసే పనులలో భాగంగా సేఫ్టీ కోసం ఆ పనులు చేపడుతున్నారు.దాంతో దాదాపు 9 రోజులు క్యాతనపల్లి రైల్వే గేటు మూసి ఉంటుందని సంబంధిత అధికారులు ప్రకటించారు.ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా మంచిగా గమనించి సహకరించాలని ఎమ్మార్వో,ఎస్సై, మున్సిపాలిటీ కమిషనర్, మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తో పాటు సంబంధిత అధికారులకు కూడా ఆ రైల్వే అధికారులు రైల్వే గేటు మూసివేత చేపడుతున్నట్లు నోటీసు ద్వారా ప్రకటించారు.

జీవితమంటేనే ఒక సవాల్ ? నిజాయితీగా గేలవాలి

Image
జీవితమంటేనే ఒక సవాల్ ? నిజాయితీగా గేలవాలి జీవితమనేది ఊరికే కాదు..కన్నీళ్లు పెట్టికోవాలి..కష్టాలు ఎదుర్కోవాలి..బాధలు తట్టుకోవాలి..మనస్సుకి గాయాలు చేసుకోవాలి..మాటలకు గుండె ముక్కలు కావాలి..ఎదురు దెబ్బలు తినాలి.అంతేకాదు కొన్నిసార్లు బంధాలను కోల్పోవాలి.సహనంతో మెదగాలి.ఆ గుణపాఠాలు నేర్చుకోవాలి.ఇంకా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి.ప్రతిక్షణం నీతో నీవు యుద్ధం చేయాలి.నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉండాలి..నీ నిర్ణయం మీదనే నీకు ధైర్యం ఉండాలి.నీ నిశ్చయత మీద నీకు ప్రణాళిక ఉండాలి.నీ ఆలోచన మీద నీకు నిలకడ ఉండాలి.ఎన్నో ఆశలు ఉండొచ్చు కానీ,ఆశలు లేకున్నా ఉన్నదానిలో తృప్తిగా,మనస్ఫూర్తిగా..మనసారా..బ్రతకడం నేర్చుకోవాలి.ఏదో చేయాలని ఆశ..ఎదో చేయలేకున్న చేసేదానిలో సంతృప్తి పొందాలి..లోకమంతా విహరించకున్న విరహం లేకుండా బ్రతకగలగాలి.ఆశించటం అంటే కనపడే చెట్టుపై ఉన్న కాయలను కోసినంత సులువు కాదు..ఆశించిన దానిని పొందడం దానికి ఎంతో నిబద్ధతతో నిజాయితీగా ఉన్నప్పుడు మాత్రమే అది అనుకున్నవి పొందగలం.అలాగే ఎన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురైనా..నీ చుట్టు అంధకారం చుట్టు ముట్టిన..తొందరపడకు కాస్త సహనం వహించు.అవన్నీ నీకు తల వంచుతాయి.ఎప్ప...

కొద్ది గంటల్లోనే భూమి మీదకు సునీతా విలియమ్స్

Image
కొద్ది గంటల్లోనే భూమి మీదకు సునీతా విలియమ్స్ --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్.. మరికొద్ది గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు.ఆ క్రమంలో చూస్తే..మరికొన్ని గంటల్లో స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరుగుపయనం ప్రారంభం కానుంది.ప్రధానంగా అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు సునీతా విలియమ్స్ భూమ్మీద ల్యాండ్ కానుందని నాసా వెల్లడించింది.

ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్?

Image
ఈనెల 19న భూమి మీదికి రానున్న సునీతా విలియమ్స్ ? --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... హైదరాబాదు న్యూస్ మార్చి-16 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : అంతరిక్షంలో చిక్కుకు పోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,బారీ బుచ్ విల్‌మోర్ భూమిపైకి తిరిగి రాబోతున్నారు.ఆ క్రమంలో చూస్తే..నాసా ప్రకారం..భూమి మీదకు ఈ నెల 19,20 తేదీల్లో తిరిగి రావొచ్చునని స్పష్టం చేసింది.అయితే గత10 నెలలుగా అంతర్జాతీ య అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉంటున్న ఆ ఇద్దరు వ్యోమగాములు ఎట్టకేలకు భూమిపైకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు.గత కొన్నినెలల క్రితమే 58 ఏళ్ల సునీతా విలియమ్స్,61 ఏళ్ల విల్‌మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్షనౌకలో అంతరిక్షానికి పయనమైయ్యారు. ఆ కొత్త వ్యోమనౌక పనితీరును పరీశీలించేందుకు సునీతా,విల్‌మోర్‌ స్పేస్‌కు వెళ్లారు.కానీ ఊహించని పరిణామాలతోనే జూన్ 5న ఫ్లోరిడాలో టేకాఫ్ అయిన వెంటనే సాంకేతిక సమస్యలు తలెత్తాయి.నాసా అధికారులు అక్కడి సాంకేతిక సమస్యలను అర్ధం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.కానీ ఆ ఫలితం శూన్యం.ఆ నేపథ్యంలోనే చేసేది ఏమిలేక వ్యోమగాములను అంతరిక్ష నౌకలోనే వదిలేసి స్టార్ లైనర్ సెప్టెంబరు7, 2024...

జర్నలిస్టు ముసుగులో నకిలీలను గుడ్డలూడదీసి ఊరేగిస్తా..

Image
జర్నలిస్టు ముసుగులో నకిలీలను గుడ్డలూడదీసి ఊరేగిస్తా..   --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్ హైదరాబాద్ న్యూస్ మార్చి-15, జర్నలిస్టు తెలుగు దినపత్రిక :సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే చూస్తూ..ఊరుకోనని శనివారం సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.ఆ క్రమంలో చూస్తే..ప్రజా జీవితంలో ఉన్నందున ఓపిక పడుతున్నానని ఆయన అన్నారు.ఆ పెయిడ్ ఆర్టిస్టులతో తిట్టించి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడతారని ఆయన హెచ్చరించారు.ఎవరి పడితే వాళ్ళు ఛానల్ పెట్టుకుని ఇష్టాను రాజ్యాంగ మాట్లాడితే వాళ్లు జర్నలిస్టులు అవుతారా? అని ఆయన ప్రశ్నించారు.సోషల్ మీడియాలో హద్దు మీరుతున్న వారిని బట్టలూడదీసి రోడ్లమీద తిప్పిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,హెచ్చరిచారు.జర్నలిస్టు రేవతి,అరెస్టు విషయంలో బీఆర్ఎస్ వైఖరిపై సీఎం మండిపడ్డారు.ఇవాళ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీస్ లోనే పెట్టి వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు పెటితే వాటిపై పోలీసులు కేసు పెట్టి ఇద్దర్ని అరెస్టు చేశారు.దానికి  బీఆర్ఎస్ నేతలకు దుఃఖం వస్తుంది...

సునీతను తీసుకొచ్చేందుకు..నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్?

Image
సునీతను తీసుకొచ్చేందుకు..నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న యూఎస్ వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్మోర్ను తీసుకొచ్చేందుకు 'ఫాల్కన్-9' నింగిలోకి దూసుకెళ్లింది.ఆ క్రమంలో చూస్తే...ఎలాన్ మస్క్లు చెందిన 'స్పేస్ ఎక్స్' సంస్థ కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఉదయం 4.30 గం.కు విజయవంతంగా ప్రయోగం చేపట్టింది.ఫాల్కన్-9లో ఆ నలుగురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు.ఆ నేపథ్యంలోనే 9 నెలలుగా అక్కడే ఉండిపోయిన సునీత, విల్మోర్ వారితో కలిసి మరికొద్దిరోజుల్లో భూమిపైకి రానున్నారు.

ఎదుటివారికి ఇబ్బంది లేకుండా మహిళలతో మర్యాదగా ఉండాలి

Image
ఎదుటివారికి ఇబ్బంది లేకుండా మహిళలతో మర్యాదగా ఉండాలి --  సంప్రదాయ పద్ధతుల్లో హోలీ జరుపుకుందాం --  రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... మంచిర్యాల న్యూస్ మార్చి-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : ఎదుటివారికి అసలు ఇబ్బంది కలిగించకుండా మహిళల పట్ల ముందు మర్యాదగా ఉంటూ సంప్రదాయ పద్ధతుల్లోనే హోలి జరుపుకుందామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు పిలుపునిచ్చారు.ఆ క్రమంలో చూస్తే.. హోలీ పండుగ సందర్బంగా పోలీస్ కమిషనర్  ప్రజలకు అనేక సూచనలు చేశారు.సహజ సిద్దమైన రంగులను వినియోగిస్తూ హోలీ పండుగను ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు.ముఖ్యంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు.హోలీ అనంతరం యువత స్నానాల కోసం పట్టణ గ్రామ శివారు ప్రాంతాల్లోని చెరువులు,లోతట్టు ప్రాంతాలకు వెళ్ళవద్దన్నారు. ప్రధానంగా బహిరంగ ప్రదేశాలపై,అనుమతి లేకుండా   వ్యక్తులపై,మహిళలు,యువతులు,వాహనాలపై రంగులు చల్లడం బైకులపై,కార్లల్లో గుంపులుగా తిరిగి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.హోలీ పండుగను సజావుగా జరు...

ఇందారం1-ఏ గనిలో సైడ్ వాల్ కూలి కార్మికునికి తీవ్ర గాయాలు

Image
ఇందారం1-ఏ గనిలో సైడ్ వాల్ కూలి కార్మికునికి తీవ్ర గాయాలు -  ఆ గని ప్రమాదంలో ముగ్గురు క్షేమంగా ఉన్నారు -  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్.... శ్రీరాంపూర్ న్యూస్ మార్చి-13 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : సింగరేణి కాలరీస్ లోని  శ్రీరాంపూర్ డివిజన్ గల ఇందారం-1 ఏ గని భూగర్భంలో పైకప్పు సపోర్టు కోసం కార్మికులు దిమ్మలు కడుతుండగా ఆ భూగర్భ గనిలోని వర్కింగ్ ప్లేస్ లో సైడ్ వాల్ ఫాల్ అయి కూలీ పడటంతో గురువారం అంగలి రాజయ్య అనే సపోర్ట్ మెన్ కార్మికుని ఎడమ కాలు విరిగింది.ఆ క్రమంలో చూస్తే..గని భూగర్భంలోని సెవెన్ లెవెల్ 32- డీప్ లోని అక్కడి పని స్థలంలో పైకప్పు కూలకుండా ఉండడానికి రెండు దిమ్మెలు సంబంధిత కార్మికులు సపోర్టు కోసం పూర్తి చేసి మూడవ దిమ్మె కూడా కడుతున్న సమయంలో ఒక్కసారిగా సైడ్ వాల్ కూలీ రాజయ్య ఎడమ కాలుపై పడింది.దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.అనంతరం వెంటనే బాధిత కార్మికుని రామకృష్ణాపూర్ లోని ఏరియా ఆసుపత్రికి తోటి కార్మికులు తరలించారు.ఆ నేపథ్యంలోనే ఆసుపత్రి వైద్యులు తక్షణమే చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆసుపత్రికి రిఫరల్ చేశారు.ఆ సందర్భంగా కార్మిక సంఘం...

ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి

Image
ప్రమాదానికి గురైన మహిళను హాస్పిటల్ కు తరలించిన డిసిపి -- డీసీపీ భాస్కర్ సేవలపై హర్షం - అభినందనలు --  జర్నలిస్టు తెలుగు దినపత్రిక అండ్ మీడియా న్యూస్... మంచిర్యాల న్యూస్ మార్చి-12 జర్నలిస్టు తెలుగు దినపత్రిక : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోగల మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్ (ఐపిఎస్) మంచిర్యాల నుంచి లక్షేట్టిపేట వైపు వెళ్తున్న సమయంలో బుధవారం రాత్రి వేంపల్లి గ్రామం వద్ద ఊహించని విధంగా రోడ్డు ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఒక మహిళను ఢీ కొట్టి ప్రమాదం చేసి వెళ్లినట్టుగా అక్కడి ఆనవాళ్లు బట్టి తెలిసింది.ఆ సదరు మహిళా రోడ్డుపై పడి ఉండటం గమనించిన మంచిర్యాల డిసిపి భాస్కర్ పోలీసు అధికారి తక్షణమే ఆయన యొక్క పోలీసు వాహనం ఆపినారు.అటుపిమ్మట మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కు స్వయంగా దగ్గర ఉండి ఆ బాధిత మహిళను ఆటోలో ఎక్కించి పంపించారు.ఆ తరుణంలో డీసీపీ స్పందించిన గొప్ప తీరును స్థానిక వాహనదారులు,ప్రజలు హార్షం వ్యక్తం చేశారు. ఒక దశలో అభినందనలు తెలిపారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవంతో ఠాగూర్ స్టేడియంలో మహిళలకు ఆటల పోటీలు

Image
--  అంతర్జాతీయ మహిళ దినోత్సవంతో ఠాగూర్ స్టేడియంలో మహిళలకు ఆటల పోటీలు --  విజేతలకు బహుమతులు ప్రధానం  అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సింగరేణి ఠాగూర్ స్టేడియంలో మంగళవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన మహిళలకు అనేకరకాల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాటల పోటీలు,ఆటల పోటీలు,కబడ్డీ,లెమన్ స్పూన్,టాగ్ ఆఫ్ వార్,మ్యూజికల్ చైర్,బంప్ బ్లాస్ట్ పోటీలను చూడచక్కగా నిర్వహించారు.అనంతరం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అలాగే మహిళలకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ జి.రాజు,రెండవ అదనపు ఎస్ఐ లలిత,డాక్టర్ మానస,పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పల్లె రాజు, రఘునాథరెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కల,మాజీ కౌన్సిలర్లు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.